- పరీక్ష రాయనున్న 10, 967 మంది
- ఏర్పాట్లపై డీఆర్ఓ సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏప్రిల్ 12న యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ పరీక్షలు హైదరాబాద్ జిల్లాలో 27 సెంటర్లలో జరగనున్నాయి. ఈ ఏర్పాట్లపై కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ ఈ. వెంకటాచారి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 12న జిల్లాలోని 27 సబ్ సెంటర్లలో 10, 967 మంది పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్‌ను కరెక్ట్చేయాలని సూపర్ వైజర్లు, లోకల్ ఇన్ స్పెక్టింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. ఏసీపీ కేవీఆర్ సత్యనారాయణ, ఏసీపీ (ట్రాఫిక్) జి. లక్ష్మణ్, ఎగ్జామినేషన్సెక్షన్ సూపరింటెండెంట్ ఎం. మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
